గ్రేటర్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్ - పార్టీ అభ్యర్థులతో కేటీఆర్ భేటీ

15:39 November 20
గ్రేటర్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్
గ్రేటర్ తెరాస అభ్యర్థులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరుపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ నేతలు కేకే, మంత్రులతో కలిసి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేశారు.
150 డివిజన్లలో సగం డివిజన్లు మహిళలకు ఇవ్వాలని సీఎం చట్టం తెచ్చారన్న కేటీఆర్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 85 డివిజన్లు మహిళలకే కేటాయించినట్లు తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. అనంతరం పార్టీ బీ ఫారాలను అందించారు. శనివారం తెరాస అభ్యర్థులంతా రిటర్నింగ్ అధికారులకు బీ ఫారాలను సమర్పించనున్నారు.