తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR inauguration at medical device park: నేడు 7 లైఫ్​ సైన్సెస్​ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్న కేటీఆర్​ - medical device park

KTR inauguration at medical device park: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన... దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్కు (medical devices park)లో నేడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్​ సుల్తాన్​పూర్​లోని ఈ పార్కులో​ ఒకే రోజు ఏడు కంపెనీలను మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్నారు.

medical devices park
వైద్య పరికరాల తయారీ పార్కు

By

Published : Dec 15, 2021, 10:05 AM IST

KTR inauguration at medical device park: హైదరాబాద్​ సుల్తాన్ పూర్​లోని మెడికల్​ డివైజెస్​ పార్కులో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​.. నేడు ఏడు లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్నారు. తద్వారా రూ. 265 కోట్ల పెట్టుబడిని, 1300 ఉద్యోగాలను ఈ కంపెనీలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభానికి సిద్ధమైన ప్రోమియా థెరపెటిక్స్, హువెల్ లైఫ్ సైన్సెస్, ఆక్రితి ఆక్యులోప్లస్ట్రీ, ఆర్కా ఇంజినీర్స్, ఎస్వీపీ టెక్నో ఇంజినీర్స్, ఎల్వికాన్ అండ్ రీస్ మెడిలైఫ్ యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

బిలియన్​ డాలర్ల పరిశ్రమగా...

ఈ నూతన యూనిట్లలో రాష్ట్రం నుంచి ఇన్ విట్రో డయాగ్నొసిస్, కేర్ డివైజెస్​, అనలైజర్లు, ఆక్యులర్ ఇంప్లాట్స్, సర్జికల్, డెంటల్ ఇంప్లాట్స్, వుండ్ డ్రెస్సింగ్ వంటి మెడికల్ ఉత్పత్తులను ఈ కంపెనీలు తయారుచేయనున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఇండస్ట్రియల్ పార్కులో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి రావటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2030 కల్లా తెలంగాణ లైఫ్ సైన్సెస్​ను వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా మలిచేందుకు ఇదొక ముందడుగని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:PHCS in TS: అక్కరకురాని కేంద్రాలు.. వైద్యులు లేక నిరుపయోగంగా సబ్‌సెంటర్లు..!

ABOUT THE AUTHOR

...view details