Minister KTR to inaugurate Nagole flyover: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం ద్వారా నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్‌ను నేడు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మొత్తం రూ.143 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను జీహెచ్ఎంసీ నిర్మించింది. దాదాపు కిలోమీటర్ పొడవు ఉండే నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చేరుకోవచ్చు.
ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్ అండర్ పాస్ నిర్మాణంతో ఇన్నర్ రింగ్ రోడ్డుపై సాఫీగా ప్రయాణం సాగుతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులభతరం అవుతుంది. నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండడంతో ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో 16వ ఫ్లైఓవర్ అవుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు.