ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు హైదరాబాద్‌లోని 4 స్లిప్, లింక్ రోడ్లను ప్రారంభించనున్నారు. శేర్లింగంపల్లి జోనల్ ఆఫీస్ నుంచి నేషనల్ హైవే 65 జీఎస్ఎం మాల్ వరకు, కూకట్పల్లి జోన్లో హై టెన్షన్ లైన్ నుంచి మియాపూర్ రోడ్ వరకు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70 ప్రశాసన్‌నగర్ నుంచి నార్నె రోడ్ నెంబర్ 78 ఇది వరకు, హెచ్ఎండీఏ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీలోని నెక్నామ్పూర్ రోడ్డు నుంచి ఉస్మాన్‌సాగర్ రోడ్డు వరకు అల్కాపురి టౌన్ షిప్ మీదుగా నిర్మించిన రోడ్లను మంత్రి ప్రారంభించనున్నారు.
నేడు 4 స్లిప్, లింక్ రోడ్లను ప్రారంభించనున్న కేటీఆర్ - కేటీఆర్ వార్తలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గించేందుకు బల్దియా దృష్టి సారించింది. అందులో భాగంగా స్లిప్, లింక్ రోడ్లను నిర్మించింది. ఇటీవల నిర్మించిన 4 స్లిప్, లింక్ రోడ్లను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.
నేడు 4 స్లిప్, లింక్ రోడ్లను ప్రారంభించనున్న కేటీఆర్