తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేది తెరాస మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఎల్.రమణకు పార్టీ సభ్యత్వం ఇచ్చి... తెరాసలోకి లాంఛనంగా ఆహ్వానించారు. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల్ని గులాబీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలిగారు.
L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'
రెండు పదవులు రాగానే కొందరు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఎగిరెగిరి పడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కేసీఆర్ ముందు కుప్పిగంతులు వేసినట్లే. రాష్ట్రంలో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నవారు కానీ.. పలు సందర్భాల్లో మనతో విభేదించిన వారు కానీ ఈ రోజు కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని నమ్ముతున్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేవలం తెరాసతోనే జరుగుతుందని నమ్మి... మనతో కలిసి పని చేసేందుకు వస్తున్నారు. కాంగ్రెస్, భాజపా వాళ్లకు తెలంగాణ అనేది 28 రాష్ట్రాల్లో ఒకటి. వారికి మన రాష్ట్రమేమి ప్రాధాన్యత కాదు. కానీ తెరాసకు తెలంగాణ మాత్రమే. ద్వంద్వ ప్రమాణాలు లేకుండా.. రెండు నాలుకలు లేకుండా... రాజీ లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక పార్టీ తెరాస.