Minister KTR in we Hub 5th Anniversary మండల స్థాయి నుంచి ఔత్సాహిక మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు వీలుగా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని వీ-హబ్ ఐదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ వేడుకలు హోటల్ తాజ్ కృష్ణా వేదికగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్... పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
Minister KTR Comments on women సింగిల్ విండో పద్ధతితో పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. విద్యార్థినులు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేటీఆర్ తెలిపారు. వీ హబ్ ద్వారా మహిళలు ఎదగటమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించటం సంతోషకరమన్నారు.
'' రూ.1.30కోట్లు ఇస్తే వి హబ్ నుంచి ఒక స్టార్టప్‌తో రూ.70 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నాం. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నాం. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు..? ప్రతీ పారిశ్రామిక పార్క్‌లలో 10 శాతం ప్లాట్స్ మహిళలకు కేటాయించాం. ప్రతీ 3 కొవిడ్ టీకాల్లో రెండు హైదరాబాద్ నుంచి వచ్చాయి. మహిళా వ్యాపారులకు సింగల్ విండో విధానం అమలు చేస్తాం.'' - కేటీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి