దావోస్లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం - Minister KTR was a rare honor at the World Economic Forum 2020
16:00 January 23
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రభుత్వాధినేతలు, కేంద్ర మంత్రులు పాల్గొనే గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు కేటీఆర్ పాల్గొన్నారు.
కీపింగ్ పేస్ టెక్నాలజీ- టెక్నాలజీ గవర్నెన్స్ ఎట్ క్రాస్ రోడ్స్ పేరుతో జరిగిన సమావేశంలో సెర్బియా, పోలాండ్, ఈస్టోనియా దేశాల ప్రధానమంత్రులతో పాటు వివిధ దేశాలకు చెందిన కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర స్థాయి ఆహ్వానితులు కేటీఆర్ మాత్రమే. ప్రపంచ నాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వివిధ అంశాలపై మాట్లాడుకునే అవకాశాన్ని ఈ సమావేశం ద్వారా వరల్డ్ ఎకనమిక్ ఫోరం కల్పిస్తుంది.
ఇవీ చూడండి:అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం