హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలోని పటేల్‌నగర్ వరద ముంపు ప్రాంతాలను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, అంబర్‌పేట ఎమ్మెల్యే వెంకటేష్, కార్పొరేటర్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.
'ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాం' - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్ అంబర్‌పేటలో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు ముంపునకు గురైన పటేల్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. స్థానికులు తమ అవస్థలను మంత్రికి వివరించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
!['ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాం' minister ktr visits rain effected areas in amberpeta hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9185008-511-9185008-1602761940103.jpg)
'ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాం'
వరద ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అన్ని చర్యలు చేపట్టి.. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండిః వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష