తెలంగాణ

telangana

ETV Bharat / state

టోలీచౌకి నదీమ్ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటన - Minister KTR Tour Details

మహానగరం కుండపోత వర్షాలతో కాలనీలు, రోడ్లు చెరువులు, జలాశయాలను తలపిస్తున్నాయి. నగరంలోని టోలీచౌకి నదీమ్​ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.

Minister KTR visit to Tolichowki Nadeem Colony in hyderabad
టోలీచౌకి నదీమ్ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటన

By

Published : Oct 15, 2020, 2:20 PM IST

హైదరాబాద్ టోలీచౌకి నదీమ్ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. నదీమ్ కాలనీలో రెండ్రోజులుగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టోలీచౌకిలో పలు కాలనీలు నీటమునిగాయి. బోట్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద బాధితులను తరలిస్తున్నారు. నదీమ్ కాలనీలో ఆరు బోట్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వరదనీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇళ్లలో చిక్కుకుపోయిన వారికి రెస్క్యూ బృందాలు ఆహారాన్ని అందిస్తున్నాయి. నదీమ్ కాలనీలో రెండ్రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచింది.

ఇదీ చదవండి:హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details