తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశానికి తెలంగాణ అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది: కేటీఆర్​ - ktr briefs Industrialists on business opportunities in Telangana

KTR UK Tour: దేశానికి తెలంగాణ అన్నింటా ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ సాధించిన విజయాలు.. భారతదేశ విజయాలుగా పరిగణించి, ప్రపంచానికి చాటాల్సిన అవసరముందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించడానికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణమని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో యూకేలో పర్యటిస్తున్న మంత్రి లండన్‌లోని హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

దేశానికి తెలంగాణ అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది: కేటీఆర్​
దేశానికి తెలంగాణ అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది: కేటీఆర్​

By

Published : May 21, 2022, 4:22 AM IST

KTR UK Tour: ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించడానికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. దేశానికి తెలంగాణ అన్నింటా ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో యూకేలో పర్యటిస్తున్న మంత్రి లండన్‌లోని హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. నెహ్రూ సెంటర్‌లో జరిగిన భేటీకి భారత్, బ్రిటన్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌ భారత్‌ ప్రపంచంతో పోటీపడి ముందుకెళ్లాలంటే విప్లవాత్మక సంస్కరణలు అవసరమని చెప్పారు. అప్పుడే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించవచ్చన్నారు. ఇదే విధానంతో రాష్ట్రం ముందుకు పోతోందని తెలిపారు. తెలంగాణ సాధించిన విజయాలు.. భారతదేశ విజయాలుగా పరిగణించి, ప్రపంచానికి చాటాల్సిన అవసరముందన్నారు.

డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ జొయ్ ఘోష్, నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ అనేక అంశాల పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల జనాభా వృద్ధాప్యం వైపు నడుస్తుంటే, భారత దేశ జనాభాలో ఉన్న అత్యధిక యువ బలం ఆధారంగా అగ్రశ్రేణి దేశంగా మారేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒకవైపు పాలనా సంస్కరణలు, పెట్టుబడి స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న సంక్షోభిత పరిస్థితులను దాటుకొని ఈ రోజు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు ఆకర్షించే ఒక అద్భుతమైన పెట్టుబడుల ఆకర్షణీయ గమ్యస్థానంగా మారడానికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణమన్నారు.

కేవలం పెట్టుబడులే కాకుండా ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన తీరుని వివరించగా, సమావేశానికి హాజరైన వారు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించారు. వివిధ దేశాల్లో ఉన్న భారత ఎన్నారైలు దేశం యొక్క విజయాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థికాభివృద్ధి వంటి అనేక అంశాల పైన సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు సమాధానంగా తన అభిప్రాయాలను కేటీఆర్ పంచుకున్నారు. మంత్రి కేటీఆర్​తో జరిగిన సమావేశం అనంతరం సభకు హాజరైన పలువురు ఆయనను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details