KTR Tweet On Kaleswaram: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా... రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు చోద్యం చూస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. అన్ని అర్హతలున్నప్పటికీ.. కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా... అని మంత్రి ప్రశ్నించారు. కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా..