KTR Tweets : ఎన్డీఏ నుంచి జేడీయూ నిష్క్రమించిన తర్వాత ఎంతమంది కూటమి భాగస్వాములు మిగిలారంటూ రాష్ట్ర పురపాలక,ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ ఐటీ, ఈడీ కాకుండా ఎంతమంది అంటూ ట్విటర్లో ఎద్దేవా చేశారు.
ఎన్డీఏలో సీబీఐ, ఈడీ కాకుండా ఎంతమంది మిగిలారు: కేటీఆర్ - KTR Latest News
KTR Tweets : ఎన్డీఏ నుంచి జేడీయూ నిష్క్రమించిన తర్వాత ఎంతమంది కూటమి భాగస్వాములు మిగిలారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఐటీ, ఈడీ కాకుండా ఎంతమంది అంటూ ట్విటర్లో ఎద్దేవా చేశారు.
అసలేం జరిగిదంటే:విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇస్తున్న భాజపా నాయకత్వానికి బిహార్ సీఎం, జేడీ(యు) నేత నీతీశ్‌కుమార్ ఝలక్ ఇచ్చారు. మరోసారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీయే)తో అయిదేళ్లుగా పెనవేసుకున్న బంధాన్ని తెంచుకున్నారు. తదుపరి కొన్ని నిమిషాల్లోనే మహా కూటమితో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ప్రత్యర్థి పార్టీలను మిత్రులుగా మార్చుకున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని ఆ కూటమి ప్రభుత్వానికి సారథిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 8వ సారి బుధవారం మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు.
కామన్వెల్త్ 2022 పోటీల్లో రాష్ట్రాల వారీగా పతకాల పట్టిక: కామన్వెల్త్ 2022 పోటీల్లో రాష్ట్రాల వారీగా పతకాలు సాధించిన పట్టికలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అద్భుతంగా రాణించి పతకాల పట్టికలో రాష్ట్రాన్ని 2వ స్థానంలో నిలిపిన విజేతలకు వారి కోచ్‌లు, సపోర్టు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నాలుగో స్థానంతో ముగించింది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.