తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో పదకొండు ఏళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్... 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టారు.
కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటికి 11 ఏళ్లు పూర్తి
కేసీఆర్ దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తి. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం.. సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన కృషికి నిదర్శనంగా ఏటా నవంబర్ 29 దీక్షా దివాస్‌గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా ప్రజలకు దీక్షా దివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీక్షా దివాస్ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం... యావత్ తెలంగాణ ప్రజలని, సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అంటూ భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. ఆ నాటి కేసీఆర్ ఫోటోలను సైతం ప్రజలతో పంచుకోవటం విశేషం.
- ఇదీ చదవండి:అవకాశమిస్తే స్మార్ట్ సూరారం: వెంకటేశ్