హైదరాబాద్ పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు తెరాస సర్కారు కట్టుబడి ఉందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగిందని తెలిపారు.
పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు తెరాస కట్టుబడి ఉంది: కేటీఆర్
తెరాస ప్రభుత్వం హైదరాబాద్ నగర పౌరుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంపుదలకు కృషి చేశామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు తెరాస కట్టుబడి ఉంది: కేటీఆర్
నగరంలో పచ్చదనం పెంచేలా 934 కాలనీ పార్కులు, 460 ట్రీ పార్కులు, 58 థీమ్ పార్కులు, ప్లే పార్కులు, ట్రాన్సిట్ పార్కులు అనేకం అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ... హెచ్ఎండీఏ పరిధిలో 12 కోట్ల మొక్కలు నాటినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మొక్కల నాటడంతో వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ హరిత నగరం సంకల్పాన్ని ప్రభుత్వం చూపిందని వివరించారు.