KTR Tweet on Adilabad CCS: ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై ఈనాడు-ఈటీవీ భారత్ కథనాలపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు స్పందించారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి... పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ట్విటర్ వేదికగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. సీసీఐ పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ప్రాంతంలోని వేలాది యువతకు ఉపాధి కల్పించే సీసీఐ పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.
'వదిలించుకోవడం ఎందుకు... వృద్ధిలోకి తెద్దాం..'
KTR Tweet on Adilabad CCS: ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పునఃసమీక్షించాలని ట్వీట్ చేశారు. ఉత్తర్వులపై సమీక్షించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.
'ఆ ఉత్తర్వులపై పునఃసమీక్షించండి.. మా నుంచి సహకారం ఉంటుంది'
''కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు... ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పునఃసమీక్షించుకోండి. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తాం. '' - ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్
ఇవీ చూడండి: