తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీలను కాపాడాలని కేటీఆర్ ట్వీట్

వలస కూలీలను కాపాడాలని కోరుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాల్లో పనిచేసే వలస కార్మికుల కనీస వేతనాలు తగ్గించటం వల్ల గల్ఫ్​లో పనిచేసే తెలంగాణ వాసులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

minister-ktr-tweet-to-central-minister-jaishankar-about-migrant-workers
వలస కూలీలను కాపాడాలని కేటీఆర్ ట్వీట్

By

Published : Dec 22, 2020, 2:29 PM IST

విదేశాల్లో పనిచేసే వలస కార్మికుల కనీస వేతనాలు తగ్గించటం వల్ల గల్ఫ్ దేశాల్లో పనిచేసే లక్షలాది మంది తెలంగాణ వాసులపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్... విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్​కు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇతర దేశాల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు 30 నుంచి 50 శాతం తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని జతపరిచిన ఆయన.... కొవిడ్ వల్ల వలస కూలీలు సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు.

వలస కూలీల ప్రయోజనాలను కాపాడాలని, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.

ఇదీ చదవండి:గాజీపుర్ సరిహద్దును దిగ్భందించిన రైతులు

ABOUT THE AUTHOR

...view details