Ktr tweet On Ukraine Issue: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ktr tweet: ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తనకు సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వారందరికీ వీలైనంత త్వరగా దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.