ktr tweet today: జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉన్న కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు తగ్గితే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిందన్న గణాంకాల నేపథ్యంలో కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. జనాభా నియంత్రణ సహా చాలా అంశాల్లో దక్షిణాది రాష్ట్రాల పనితీరు బేషుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జనాభా నియంత్రణతో నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని వింటున్నానని కేటీఆర్ ప్రస్తావించారు. అదే జరిగితే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.
జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉన్న కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు తగ్గితే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది. జనాభా నియంత్రణ సహా చాలా అంశాల్లో దక్షిణాది రాష్ట్రాల పనితీరు బేషుగ్గా ఉంది. జనాభా నియంత్రణ కారణంగా నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని వింటున్నాను. అదే జరిగితే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది.-ట్విటర్లో మంత్రి కేటీఆర్