KTR Tweet: ఇటీవల భర్తను కోల్పోయిన ముస్లిం యువతి ఆశ్రిన్ కలిసి అవసరమైన సాయం అందిస్తానని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం హత్యకు గురైన దళిత యువకుడు నాగరాజు భార్య ముస్లిం యువతి ఆశ్రిన్ తన భాగస్వామిని రక్షించుకునేందుకు ఎంతో ధైర్యంగా పోరాడిందన్నారు. అయినా ఆశ్రిన్ తన భర్త నాగరాజును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం యువతి ఆశ్రిన్‌ను మంత్రి కేటీఆర్ కలవాలని... ఆ యువతిని కలిసి మతాంతర, కులాంతర జంటలకు నైతిక మద్దతుగా నిలివాలని ట్విట్టర్ ద్వారా చేసిన విజ్ఞప్తికి మంత్రి స్పందించారు. కచ్చితంగా ఆ యువతిని కలిసి అవసరమైన సాయం అందిస్తాని అన్నారు.
KTR Tweet: 'ఆశ్రిన్కు అండగా నిలుస్తాం: కేటీఆర్ - Telangana News
KTR Tweet: సరూర్నగర్లో ముస్లిం యువకుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నాగరాజు భార్యకు అండగా నిలుస్తానని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భర్తను కాపాడుకోవాలని ఆశ్రిన్ పోరాడిందన్నారు.
KTR