ktr tweet on PM Modi: ప్రధాని నరేంద్ర మోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. 2047 నాటికి సాధించాల్సిన లక్ష్యాలపై మోదీ మాటలు వినడానికి బాగున్నాయని తెలిపారు. కానీ 2022 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తానన్న హామీ ఏమైందని ట్విటర్లో ప్రశ్నించారు. అలాగే లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ది ప్రధానికి లేదని కేటీఆర్ ప్రస్తావించారు. 2022 నాటికి ప్రతి ఇంటికి విద్యుత్, మంచినీళ్లు, టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తామన్న హామీలపై సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క వాగ్దానం నెరవేర్చలేదన్న నిజాన్ని మోదీ గుర్తించాలని కేటీఆర్ ట్విటర్లో నిలదీశారు.
ktr tweet on PM Modi ఆ లక్ష్యాలు సరే మరీ హామీల సంగతేంటని కేటీఆర్ సెటైర్ - ట్విట్టర్లో కేటీఆర్ విమర్శలు
ktr tweet on PM Modi మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. దేశంలో 2022 నాటికి ప్రతి ఇంటికి కరెంట్, మంచినీళ్లు, టాయిలెట్ సౌకర్యం కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
కేటీఆర్