KTR on Pawan Hans: లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ విక్రయంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఆర్నెళ్ల క్రితం ఏర్పాటైన ప్రైవేట్ కంపెనీకి పవన్ హన్స్ సంస్థను అమ్మివేశారని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. 2017లో పవన్ హన్స్ సంస్థ విలువ 3వేల 700 కోట్ల రూపాయలు కాగా... ఇపుడు అందులో 49 శాతం వాటా కేవలం 211 కోట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందని కేటీఆర్ విమర్శనాస్త్రాలు చేశారు.
లాభాల్లో ఉన్న సంస్థను ఆర్నెళ్లక్రితం ఏర్పాటైన సంస్థకు ఎలా అమ్ముతారు..?' - పవన్ హన్స్ సంస్థ విక్రయంపై కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు
KTR on Pawan Hans: పవన్ హన్స్ సంస్థ విక్రయంపై కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు వేశారు. 3వేల కోట్ల సంస్థను.. కేవలం లక్ష మూలధన సంస్థకు అమ్మడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు.
పవన్ హన్స్ సంస్థ విక్రయంపై కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు