2015-16 నుంచి తెలంగాణ జీఎస్డీపీ ఏటా 11శాతం వృద్ధిరేటు సాధించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటని తెలిపారు. నీతి ఆయోగ్ అర్థ్ నీతి నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపి... జీఎస్డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రమని నీతిఆయోగ్ విశ్లేషించింది.
KTR: తెలంగాణ అభివృద్ధికి నీతి ఆయోగ్ నివేదికే నిదర్శనం - నీతి ఆయోగ్ అర్థ్ నీతి
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతి ఆయోగ్ అర్థ్ నీతి నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సగటున వార్షిక వృద్ధి 9 శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక తెలిపినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
నీతి ఆయోగ్ అర్థ్ నీతి నివేదిక
ఈ క్రమంలో అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులను, దేశ ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ... అర్థ్నీతి-వాల్యూమ్ 7ను విడుదల చేసింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సగటున వార్షిక వృద్ధి 9 శాతం కంటే ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:HIGH COURT: గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు కీలక సూచనలు.. ఆంక్షలు!