సామాజిక మాధ్యమాల్లో జాతిపితను తక్కువ చేసి మాట్లాడటం సరైంది కాదని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. మహాత్మా గాంధీని (Mahatma Gandhi) చంపిన నాథూరాం గాడ్సే(Nathuram Godse) అమర్ రహే అని చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఒక హంతకుడిని కీర్తిస్తూ జరుగుతున్న ప్రచారాన్ని ట్విట్టర్(twitter) వేదికగా మంత్రి తప్పుబట్టారు.
KTR: ఆ ప్రచారాన్ని ఖండించకపోవటం జాతిపితను అవమానపరచడమే: కేటీఆర్ - కేటీఆర్ ట్వీట్
జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే అమర్ రహే అన్న ప్రచారాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఖండించారు. ఓ హంతకుడిని కీర్తిస్తూ సామాజిక మధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం సరైంది కాదన్నారు.
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
ఈ రకమైన వాదనతో మహాత్మా గాంధీకి (Mahatma Gandhi) ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి, జాతిపితగా ఉన్న గుర్తింపును అవమానపరచడమేనని అన్నారు. మన జాతిపితను తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎవరీ పిచ్చి చేష్టలతో ఇలాంటి ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారో కానీ.. దీన్ని ఖండించకపోవటం, మౌనంగా ఉండటం మాత్రం మనందరికీ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు.
ఇదీ చదవండి: