Minister KTR Tweet on Election Results :తెలంగాణలో కీలక ఘట్టానికి తెరపడింది. గురువారం రోజు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు నెలలుగా నెలకొన్నఎన్నికల(Telangana Elections) హడావిడికి ముగింపు పలికినట్లయింది. ఇక డిసెంబర్ 3న నేతల భవితవ్యం తేలనుంది. నాయకులంతా ఎన్నికల ఫలితాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్ మూడోసారి గెలిచి- చరిత్ర సృష్టించడం ఖాయం : కవిత
రాబోయే ఫలితాలపై మంత్రి కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా స్పందించారు. చాలా కాలం తర్వాత.. తాను రాత్రి కంటి నిండా నిద్రపోయానని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులున్నాయని తెలిపారు. డిసెంబర్ 3న వచ్చే అసలైన ఫలితాలు.. తమకు శుభవార్త చెబుతాయని ధీమా వ్యక్తం చేశారు.
KTR Reacts on Exitpolls Today : తెలంగాణలో గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కే మొగ్గు ఉంటుందని మెజారిటీ సంస్థలు చెప్పాయి. వీటిపై కేటీఆర్ స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్కు 88 సీట్లు వస్తాయని భావించామని.. వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.