KTR vs Bandi Sanjay Tweet War: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణే లేదని మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని మాత్రం ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, మెట్రో రెండో దశ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు.
Minister KTR fires on PM Modi: తెలంగాణకు ఏదీ ఇచ్చేది లేదని మోదీ సర్కార్ చెప్పిందన్నారు. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ ఎందుకుండాలని కేటీఆర్ ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్న ఆయన.. అందుకు రాష్ట్రానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. 9 ఏళ్లుగా అడుగుతుంటే.. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ, ప్రధాని రాష్ట్రం గుజరాత్‌కు లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి 20 వేల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు.
బండి vs కేటీఆర్ ట్వీట్ వార్: గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితం ఇదని కేటీఆర్ ఆక్షేపించారు. మంత్రి కేటీఆర్, బండి సంజయ్‌ల మధ్య ట్వీట్ల వార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై బండి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు, నిన్ను ఎందుకు భరించాలి.. సహించాలని మండిపడ్డారు. అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే, ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదని ప్రశ్నించారు.