రాష్ట్రంలో బాలింత మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మెటర్నరీ మోర్టాలిటీ రేటులో తగ్గుదల రాష్ట్రంలోనే అత్యధికంగా ఉందన్నారు. బాలింత మరణాల రేటులో తగ్గుదల ఏకంగా 17.1 శాతంగా నమోదైందని వివరించారు.
ఎంఎంఆర్ రేటులో తగ్గుదల... రాష్ట్రంలోనే అత్యధికం - బాలింత మరణాల రేటు సంఖ్య
కేసీఆర్ కిట్లు, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సాహకంతో పాటు... 102, ఇతర ప్రభుత్వ చర్యల ద్వారా రాష్ట్రంలో బాలింత మరణాల రేటు గణనీయంగా తగ్గిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోనే మెటర్నరీ మోర్టాలిటీ రేటు రాష్ట్రంలో భారీ తగ్గుదల ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఎంఎంఆర్ రేటులో తగ్గుదల... రాష్ట్రంలోనే అత్యధికం
కేసీఆర్ కిట్లు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సాహకంతో పాటు 102, ఇతర సర్కార్ చర్యలు ఈ తగ్గుదలకు కారణమైందన్నారు. ఎంఎంఆర్ రేటు తగ్గుదలకు కృషిచేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, గతంలో ఆ శాఖకు సేవలందించిన లక్ష్మారెడ్డికి... కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి:సినీ పరిశ్రమతో డ్రగ్స్ ముఠా లింకులపై ఆరా