తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ప్రపంచంలోనే అతిపెద్ద వన్​ ప్లస్​ స్టోర్​.. కేటీఆర్ ట్వీట్ - త్వరలో వన్​ ప్లస్​ స్టోర్​ను సందర్శిస్తానని కేటీఆర్​ ట్వీట్​

భాగ్యనగరంలో తన నూతన ఎక్స్​పీరియన్స్​ స్టోర్​ను స్మార్​ ఫోన్​ దిగ్గజ సంస్థ వన్​ ప్లస్​ ఆవిష్కరించింది. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టోర్​.. తమకు ప్రపంచంలోనే అతిపెద్దదని కంపెనీ ప్రకటించింది. ఈ స్టోర్​ను హైదరాబాద్​కు తీసుకువచ్చినందుకు మంత్రి కేటీఆర్​ వన్​ ప్లస్​ టీంను అభినందించారు. త్వరలో ఈ స్టోర్​ను సందర్శిస్తానని ట్వీట్​ చేశారు.

ప్రపంచంలోనే పెద్దదైన వన్​ ప్లస్​ స్టోర్​ను సందర్శిస్తానని కేటీఆర్​ ట్వీట్​​
ప్రపంచంలోనే పెద్దదైన వన్​ ప్లస్​ స్టోర్​ను సందర్శిస్తానని కేటీఆర్​ ట్వీట్​​

By

Published : Nov 5, 2020, 5:06 PM IST

Updated : Nov 5, 2020, 5:16 PM IST

స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వన్ ప్లస్.. హైదరాబాద్​లో త్వరలో ప్రారంభించనున్న తన నూతన ఎక్స్​పీరియన్స్ స్టోర్​ను ఆవిష్కరించింది. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ స్టోర్ తమకు ప్రపంచంలోనే అతిపెద్దదని కంపెనీ సగర్వంగా ప్రకటించింది. వన్ ప్లస్ నిజామ్ ప్యాలెస్​గా పిలవబడే ఈ భవనం తెలుపు, ఎరుపు రంగుల్లో నిర్మితమై.. హైదరాబాద్ కొత్తపాతల రూపును ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది.

16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వన్​ ప్లస్​ స్టోర్​

హైదరాబాద్​లో ప్రపంచంలోనే అతిపెద్ద వన్ ప్లస్ స్టోర్​ను తీసుకువచ్చిన వన్ ప్లస్ టీంను ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. త్వరలో ఈ స్టోర్​ను సందర్శిస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇదీ చదవండి:'హైదరాబాద్​ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు'

Last Updated : Nov 5, 2020, 5:16 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details