తెలంగాణ

telangana

ETV Bharat / state

'బ్రిటన్​ పారిశ్రామిక వేత్తలు తరలిరావాలి.. పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ' - minister ktr latest news

KTR Foreign Tour: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్​ చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు, ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. దేశంలో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్ అనేకసార్లు అవార్డులు అందుకున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

'బ్రిటన్​ పారిశ్రామిక వేత్తలు తరలిరావాలి.. పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ'
'బ్రిటన్​ పారిశ్రామిక వేత్తలు తరలిరావాలి.. పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ'

By

Published : May 19, 2022, 3:01 AM IST

Updated : May 19, 2022, 5:20 AM IST

'బ్రిటన్​ పారిశ్రామిక వేత్తలు తరలిరావాలి.. పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ'

KTR Foreign Tour: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న ఆయన.. తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను అక్కడి సంస్థలు, కంపెనీలకు వివరిస్తున్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని, బ్రిటన్​తో పాటు ప్రపంచ దేశాలన్నీ తమ సంస్థలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్... డెలాయిట్, హెచ్ఎస్బీసీ, జేసీబీ, రోల్స్ రాయిస్ లాంటి వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. టీఎస్ ఐపాస్, ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకొచ్చిన పాలసీలు, వాటి ద్వారా ఇప్పటి వరకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను ఆయా కంపెనీల ప్రతినిధులకు తెలిపారు.

వినూత్నమైన పారిశ్రామిక విధానాలకు తోడు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవ వనరులు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు, ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్... తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. దేశంలోని ఇతర నగరాల్లో లేని అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్​లో మాత్రమే ఉందని తెలిపారు. దేశంలో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్ అనేకసార్లు అవార్డులు అందుకున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం ఐటీతో పాటు లైఫ్ సైన్సెస్- ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు ఒక హబ్ గా మారిందని... పలు మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా వెలుపల తమ అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు.

భారత్ - ఇంగ్లాండ్ మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దన్న ఆయన... రాష్ట్రంలోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధనతోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలకు సంబంధించి, వివిధ అంశాలపైన ఇరువురు చర్చించారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయోఏషియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్ధనను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీఎస్ ఐపాస్ విధానం గురించి తెలుసుకున్న బ్రిటన్ మంత్రి... ఈ విధానంపై ప్రశంసలు కురిపించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 19, 2022, 5:20 AM IST

ABOUT THE AUTHOR

...view details