తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముంపు బాధితుల కోసం సెంటర్​హోం ఏర్పాటు చేస్తాం' - ముంపు భాదితుల కోసం సెంటర్​హోం ఏర్పాటు చేస్తాం

హైదరాబాద్​లోని మలక్​పేట ప్రాంతం​లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బలాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షించారు. ముంపు బాధితుల కోసం సెంటర్​హోమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Minister KTR tour in Flood prone areas in Hyderabad
'ముంపు భాదితుల కోసం సెంటర్​హోం ఏర్పాటు చేస్తాం'

By

Published : Oct 14, 2020, 5:43 PM IST

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. మలక్​పేట డివిజన్​లోని చాదర్​ఘాట్​లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బలాలతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. పాతబస్తీలో వరద ప్రభావిత ప్రాంతాల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

వారికోసం సెంటర్​హోమ్​ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రమాదకర స్థలాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం వరదలపై అప్రమత్తంగా ఉందన్నారు. అంతకుముందు ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో పర్యటించారు.

ఇవీచూడండి:జీహెచ్​ఎంసీ అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details