Bansilalpet step well inauguration : తెలంగాణ ప్రభుత్వం పురాతన కట్టడాలకు పూర్వవైభవం తీసుకొచ్చే పనిలో పడింది. శిథిలావస్థలో ఉన్న పురాతన కట్టడాలకు పునర్జీవనం అందించి వాటికి పునర్‌వైభవం తీసుకురావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ బన్సీలాల్‌పేటలోని మెట్లబావిని పునరుద్ధరిస్తోంది. పూర్వవైభవం సంతరించుకున్న ఈ మెట్లబావిని ఈ నెల 5న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ నెల 5న బన్సీలాల్‌పేట మెట్లబావి ప్రారంభోత్సవం
Bansilalpet step well inauguration : ఈనెల 5న బన్సీలాల్‌పేట మెట్లబావిని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మెట్లబావి వద్ద ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పురాతన కట్టడాలు అభివృద్ధి చేస్తున్నామని తలసాని అన్నారు.
Bansilalpet step well inauguration
మెట్లబావి ప్రారంభోత్సవం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మెట్లబావి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిజాం కాలం నాటి మెట్లబావి కాలక్రమేణా డంపింగ్ యార్డ్‌గా మారిందని మంత్రి అన్నారు. పురాతన కట్టడాలు పరిరక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ చొరవతో మెట్లబావిని పునరుద్ధరించామని వెల్లడించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పరిసరాలు కూడా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.