హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ల్యాబ్ ఏర్పాటు చేయాలంటూ తాను చేసిన విజ్ఞప్తిని ఆమోదిస్తూ మాట్లాడినందుకు ధన్యవాదాలు చెప్పారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కేటీఆర్ కృతజ్ఞతలు - తెలంగాణ వార్తలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు
హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన తరుణంలో ల్యాబ్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. జీనోమ్ వ్యాలీలో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు ఉపరాష్ట్రపతి సూచించారు.