తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలి: కేటీఆర్‌ - KTR SPEECH IN TS ASSEMBLY

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పీవీకి భారతరత్న పురస్కారం తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే కేంద్రప్రభుత్వం కూడా పీవీకి భారతరత్న ప్రకటించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

minister ktr talk about pv narasimha rao  in ts assembly monsoon session 2020
కేంద్రప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలి: కేటీఆర్‌

By

Published : Sep 8, 2020, 12:30 PM IST

Updated : Sep 8, 2020, 1:07 PM IST

కేంద్రప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలి: కేటీఆర్‌

కేంద్రప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఎందరో తెలంగాణ వైతాళికులు మరుగునపడ్డారని అన్నారు. తెలంగాణ వైతాళికులను గౌరవించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. తెలంగాణ ముద్దుబిడ్డల ఔన్నత్యం అందరూ గుర్తుంచుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్​ తీర్మానానికి తను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మంత్రి సత్యవతిరాఠోడ్​ అసెంబ్లీలో తెలిపారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన సేవలు ఎనలేనివని అసెంబ్లీ సమావేశాల్లో గుర్తు చేశారు.

భారతప్రభుత్వం పీవీకి భారతరత్న ఇవ్వాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపుర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

Last Updated : Sep 8, 2020, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details