తెలంగాణ

telangana

ETV Bharat / state

20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఎవరికీ అందలేదు: కేటీఆర్​ - Hyderabad with KTR program

హైదరాబాద్ మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో "హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్" కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​... కేంద్రం విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే జీడీపీ క్షీణించిందని మండిపడ్డారు.

Minister KTR talk about Center government 20 lakh crore financial package in ''Hushar Hyderabad with KTR "program
20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఎవరికీ అందలేదు: మంత్రి కేటీఆర్​

By

Published : Nov 25, 2020, 1:38 PM IST

Updated : Nov 25, 2020, 1:53 PM IST

20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఎవరికీ అందలేదు: కేటీఆర్​

కరోనా వాణిజ్యంతో పాటు అనేక రంగాలను దెబ్బతీసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో "హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్" కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక మంది వ్యాపారవేత్తలు విరాళాలిచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతోందని వెల్లడించారు.

కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందిందని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు దుష్ఫలితాలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు చిరువ్యాపారులను దారుణంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. కేంద్రం విధానాల కారణంగానే 8 వరుస త్రైమాసికాల్లో జీడీపీ క్షీణించిందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాకముందు విద్యుత్ కోసం ఇందిరా పార్కు వద్ద ధర్నాలు జరిగేవని చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లో కర్ఫ్యూలతో సెలవులు వచ్చేవని తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత అరగంట కూడా కర్ఫ్యూ పెట్టలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ అన్నివైపులా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌ నలువైపులా షాపింగ్ మాల్స్‌ వచ్చాయి. ఉప్పల్‌లో ఐదు ఐటీ పార్కులు ఏర్పాటు చేశాం. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీ తీసుకువచ్చాం. ఓఆర్‌ఆర్‌ వెలుపల నిర్మించే టౌన్‌షిప్‌లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.- తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

అనేక భూ సమస్యలకు ధరణి ద్వారా పరిష్కారమయ్యాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ధరణి ద్వారా స్థిరాస్తులపై పౌరులకు హక్కులు లభిస్తాయని వెల్లడించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నామని అన్నారు. అభివృద్ధి చేసే పాలన కావాలా..? ప్రజలను విభజించే పాలన కావాలా..? అని ప్రశ్నించారు.

Last Updated : Nov 25, 2020, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details