మదర్ డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్(ktr about dairy development) సూచించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, నార్ముల్ డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలందర్ రెడ్డి, రచ్చ లక్ష్మినరసింహా రెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డి ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. డైరెక్టర్లను అభినందించిన మంత్రి.. మదర్ డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని(ktr about dairy development) సూచించారు. రాష్ట్రంలో హరితవిప్లవంతో పాటు క్షీరవిప్లవం మొదలైందన్న మంత్రి.. తెలంగాణ ఏర్పడ్డాక సాగునీరు అందుబాటులోకి రావడమే అందుకు కారణమని అన్నారు.
ktr about dairy development: 'పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం.'
మదర్ డెయిరీ లాభాలకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కేటీఆర్(ktr about dairy development) సూచించారు. రాష్ట్రంలో హరితవిప్లవంతో పాటు క్షీరవిప్లవం మొదలైందన్నారు. సాగునీరు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
విజయ డెయిరీని రాష్ట్రప్రభుత్వం బలోపేతం చేసిందని గుర్తుచేశారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విజయ డెయిరీ(vijaya dairy) అనేక ఇబ్బందులు ఎదుర్కొందని... అటువంటి డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇదీ చదవండి:huzurabad liquor sales: హుజూరాబాద్‌లో మద్యం అమ్మకాల జోరు.. కోట్లలోనే..!