గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో కల్యాణ మండపం నిర్మించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలపై భవన నిర్మాణాలు చేపట్టినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు తెలిపారు. అందులో భాగంగా సీతాఫల్మండిలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌రావుతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్మాణం పనులు, అవసరమైన నిధులు తదితర వివరాలను పద్మారావు.. కేటీఆర్‌కు వివరించారు. ఫంక్షన్‌హాల్ నిర్మాణంపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు తెలిపారు.
'కల్యాణ మండపాల నిర్మాణాలు సకాలంలో పూర్తిచేయాలి' - ktr sudden visit to Multipurpose Function Hall at sitaphalmandi
సీతాఫల్మండిలో నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పనుల వివరాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు మంత్రికి వివరించారు.

సీతాఫల్మండి కల్యాణ మండపంలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీ
సీతాఫల్మండి కల్యాణ మండపంలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీ