భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అంకురాలకు సంబంధించిన కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. సీఐఐ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రిన్యూయార్షిప్ అండ్ స్టార్టప్స్గా పిలిచే ఈ కేంద్రం... ‘ప్రపంచం కోసం తెలంగాణలో ఆలోచనలు, నవకల్పవనలు’ అనే ఇతివృత్తంతో పనిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.
సీఐఐ స్టార్టప్స్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అంకురాలకు సంబంధించిన కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సీఐఐ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రిన్యూయార్షిప్ అండ్ స్టార్టప్స్గా పిలిచే ఈ కేంద్రం... ‘ప్రపంచం కోసం తెలంగాణలో ఆలోచనలు, నవకల్పవనలు’ అనే ఇతివృత్తంతో పనిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.
CII Centre for Innovation, Entrepreneurship
ఈ కేంద్రం అంకురాలు, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు సహయపడనుందన్నారు మంత్రి కేటీఆర్. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే విధంగా 3 లక్షల మంది సభ్యులను, అంకురాలను ఈ కేంద్రం అనుసంధానిస్తుందని సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ జాతీయాధ్యక్షులు గోపాలకృష్ట తెలిపారు. మార్కెట్కు ఉపయోగపడే విధంగా పరిశోధనను ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి :'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'
TAGGED:
hyderabad news