ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది: కేటీఆర్‌ - telangana varthalu

జర్నలిస్టులకు అండగా ఉండటం కోసమే వెల్ఫేర్​ ఫండ్​ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుల కుటుంబానికి అండగా నిలుస్తామని ఆయన ఇచ్చారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో 91 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆపన్న హస్తం చెక్కులు అందించారు. జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని హామినిచ్చారు.

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటాం: కేటీఆర్​
జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటాం: కేటీఆర్​
author img

By

Published : Mar 7, 2021, 4:55 PM IST

Updated : Mar 7, 2021, 5:41 PM IST

తాము మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేరని... తనకు, మంత్రులు హరీశ్​ రావు, ఈటల రాజేందర్​తో పాటు తెరాస నేతలకు కేసీఆర్ ట్రైనింగ్​ ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మాటలతో చీల్చి చెండాలంటే.. కేసీఆర్​ను మించి మాట్లాడేవాళ్లు లేరని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వాళ్ల మీద మేం మాట్లాడలేక కాదు... వారి వయసుకు, పదవికి గౌరవం ఇస్తున్నాం కాబట్టే మాట్లాడడం లేదని భాజపా నేతలకు చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే టీ కాంగ్రెస్, టీ భాజపాలు ఎక్కడివని కేటీఆర్ ప్రశ్నించారు. జలవిహార్​లో జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 91 మంది జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులు అందించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా వారిని ఆదుకుంటున్నామని తెలిపారు.

జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని హామినిచ్చారు. ఆ అంశం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ.. వాటి బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. జర్నలిస్టులు, ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసకు ఉన్నది పేగు బంధమని గతాన్ని గుర్తుచేసుకున్నారు. జర్నలిస్టులకు రూ.100 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి.. మరణించిన 260 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 1950 జర్నలిస్టులు కరోనా బారిన పడితే ఆదుకున్న ఏకైక ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు.

భాజపా పాలిత గుజరాత్​లో అక్రిడేషన్ కార్డులు వెయ్యి మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులకు నాణ్యమైన ఆరోగ్య స్కీం తీసుకొస్తామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో యూనియన్ కార్యాలయం ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి, అండగా ఉన్న సర్కారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులు అండగా ఉండాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టుల ఆశీర్వాదం కావాలని కోరారు. తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చిందని ఆయన గుర్తుచేశారు.

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటాం: కేటీఆర్​

ఇదీ చదవండి:ఎవరు ఎవర్ని ఆదుకుంటున్నారో అర్థమవుతోంది: కేటీఆర్

Last Updated : Mar 7, 2021, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details