హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రి కేటీఆర్ మెట్రో సిబ్బందిని అభినందించారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో రెండో స్థానంలో నిలవడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. మెట్రో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేపు రాయదుర్గం మెట్రో స్టేషన్‌ను ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రోజుకు లక్షా 51వేల మంది ప్రయాణికుల నుంచి... నేటికి రోజుకు 4లక్షల ప్రయాణికులను మెట్రో గమ్యస్థానాలకు చేర్చుతుందని తెలిపారు. రాయదుర్గం స్టేషన్ ప్రారంభించిన తర్వాత రోజుకు 40వేల మంది వరకు ప్రయాణికులు పెరుగుతారని వివరించారు.
మెట్రో సిబ్బందికి మంత్రి కేటీఆర్ అభినందనలు - మెట్రో సిబ్బందిని అభినందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మెట్రో సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు. రేపు రాయదుర్గం మెట్రో స్టేషన్‌ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
మెట్రో సిబ్బందిని అభినందించిన మంత్రి కేటీఆర్