తెలంగాణ

telangana

ETV Bharat / state

Ktr on Taiwan investments: భారత్​- తైవాన్​ భాగస్వామ్యానికి హైదరాబాద్​లో పునాది: కేటీఆర్​ - taiwan connect telangana state meeting under invest india

తెలంగాణ- తైవాన్(telangana- Taiwan) మధ్య అద్భుతమైన భాగస్వామ్యం(Ktr on Taiwan investments) ఉందని మంత్రి కేటీఆర్(minister ktr) వెల్లడించారు. తైవాన్​ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం తైవాన్​లో పర్యటించినట్లు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రంలో తైవాన్​ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. తైవాన్- కనెక్ట్ తెలంగాణ స్టేట్(Taiwan connect telangana state) సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.

Ktr on Taiwan investments
తెలంగాణ- తైవాన్

By

Published : Sep 30, 2021, 1:03 PM IST

Updated : Sep 30, 2021, 3:06 PM IST

తైవాన్(Ktr on Taiwan investments) పెట్టుబడులకు రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(minister ktr) వెల్లడించారు. ఇన్వెస్ట్ ఇండియా(invest India) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్-కనెక్ట్ తెలంగాణ(Taiwan connect telangana state)స్టేట్ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. తైవాన్, తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలు, కంపెనీలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ- తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తైవాన్‌తో టెక్నాలజీ పార్ట్నర్‌ షిప్ ఒప్పందాన్ని ఆయన ప్రస్తావించారు. తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న కేటీఆర్... ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో మరింత భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు.

భారత్​- తైవాన్​ భాగస్వామ్యానికి హైదరాబాద్​లో పునాది: కేటీఆర్​

ఐదేళ్లుగా ప్రగతి బాటలో

ఇండియన్- తైవాన్(Ktr on Taiwan investments) స్టార్టప్ భాగస్వామ్యం ఏర్పాటు చేసిన ఏకైక భారత సిటీగా హైదరాబాద్(Hyderabad) ఉందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఐదేళ్లుగా సాధించిన ప్రగతిని క్లుప్తంగా వివరించారు. రాష్ట్రం సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని కేటీఆర్​ వివరించారు. సరళతర వాణిజ్యవిధానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటమే గాక.. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ వస్తోందని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తైవాన్‌(Ktr on Taiwan investments)కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఏకైక సిటీగా హైదరాబాద్​

రాష్ట్రంలో తైవాన్ పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తాం. తెలంగాణ - తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉంది. పెట్టుబడుల కోసం తైవాన్‌లో పర్యటించాను. తైవాన్ పారిశ్రామికవర్గాలతో మరింత భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలి. ఇండియా- తైవాన్​ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసిన ఏకైక భారత సిటీగా హైదరాబాద్ నిలిచింది. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

రాష్ట్రంపై ప్రశంసలు

ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ దీపక్ బగ్లా రాష్ట్ర పాలసీలు, సాధిస్తున్న పురోగతిపై ప్రశంసలు కురిపించారు. ఇన్వెస్ట్ ఇండియా తరఫున తెలంగాణతో కలిసి పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తైవాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్ జేమ్స్ ఎఫ్​.హువంగ్ తైవాన్‌కు తెలంగాణ సహజ భాగస్వామిగా అభివర్ణించారు. ఎలక్ట్రానిక్స్, దాని అనుబంధ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:GRMB Subcommittee meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ

Last Updated : Sep 30, 2021, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details