కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తుందన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గత ఆరేళ్లుగా రూ. 2 లక్షల 72 వేల 962కోట్లు వివిధ పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రం వసూలు చేసినట్లు తెలిపారు.
ఎవరు ఎవర్ని ఆదుకుంటున్నారో అర్థమవుతోంది: కేటీఆర్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు రూ. 2లక్షల కోట్లకు పైగా కేంద్రానికి కడితే... రాష్ట్రానికి కేవలం రూ. లక్షా 40వేల కోట్లు మాత్రమే చెల్లించారని విమర్శించారు.
ఎవరు ఎవర్ని ఆదుకుంటున్నారో అర్థమవుతోంది: కేటీఆర్
అయినా ఇప్పటికీ రాష్ట్రానికి కేవలం రూ. లక్షా 40వేల329 కోట్లు మాత్రమే ఇచ్చిందని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఎవరిని ఎవరు ఆదుకుంటున్నారో అర్థమవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశాభివృద్ధికి తెలంగాణ ప్రజలు తోడ్పడుతున్నందుకు ఆనందంగా ఉందంటూ... మంత్రి ట్వీట్ చేశారు.
ఇవీచూడండి:అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి మృతి