తెలంగాణ

telangana

ETV Bharat / state

'థాయ్​లాండ్​కు భారత్​కు దగ్గర సంబంధాలున్నాయి' - తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణలో వాణిజ్యానికి అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. మాదాపూర్​లో ఇండియా-థాయ్​లాండ్​ మ్యాచింగ్​ అండ్​ నెట్​వర్కింగ్​ సమావేశానికి హాజరయ్యారు.

minister ktr says that together thailand and india can make wonders in developing our countries
'థాయ్​లాండ్​కు భారత్​కు దగ్గర సంబంధాలున్నాయి'

By

Published : Jan 18, 2020, 12:02 PM IST

థాయ్​లాండ్​కు భారత్​కు చాలా దగ్గర సంబంధాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం.. దేశ వృద్ధిరేటును మించి అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

హైదరాబాద్​ మాదాపూర్​లో ఇండియా-థాయ్​లాండ్​ మ్యాచింగ్​ అండ్​ నెట్​వర్కింగ్​ సమావేశానికి థాయ్​లాండ్​ ఉపప్రధాని జరీన్​ లక్సనావిసిత్​తో పాటు మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు.

తెలంగాణలో ఆహార శుద్ధి రంగంలో అపార అవకాశాలున్నాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఫర్నీచర్​ పార్క్​ ఏర్పాటు చేయాలని థాయ్​ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్​- బ్యాంకాక్​ల మధ్య డైరెక్ట్​ విమాన సర్వీసులున్నాయని, పర్యాటకంగా ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందొచ్చని సూచించారు.

'థాయ్​లాండ్​కు భారత్​కు దగ్గర సంబంధాలున్నాయి'

ABOUT THE AUTHOR

...view details