ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధినేతగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాపై కేటీఆర్ పలు అంశాలపై ట్విటర్లో తనదైన శైలిలో స్పందించారు.
కేసీఆర్ కూడా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలనేపథ్యంలో ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీ అని అర్థమైందని వ్యాఖ్యానించారు. అటు ఆదాని అంశంపైనా స్పందించిన కేటీఆర్... ప్రపంచ పేదరిక రాజధానిగా భారతదేశం... నైజీరియాను అధిగమించిందని.. ఇదే సమయంలో ఆదానీ బిల్ గేట్స్‌ను దాటి మరీ ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడయ్యారని పేర్కొన్నారు. ఇవి దేశానికి సంబంధించి రెండు కఠోర వాస్తవాలను అని అన్నారు.