తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీజీ.. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా..?: కేటీఆర్​

KTR TWEET: జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద రాష్ట్రానికి ఒక్క రూపాయీ ఇవ్వకపోవడం సబ్ కా సాత్-సబ్ కా విశ్వాస్​కు నిదర్శనమా అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎన్డీఆర్ నిధుల విషయమై కేంద్రం వైఖరిని తప్పుపట్టిన మంత్రి.. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. 2018 నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద అందించిన వరద సాయం వివరాల పత్రాన్ని తన ట్వీట్​తో జత చేశారు.

మోదీజీ.. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా..?: కేటీఆర్​
మోదీజీ.. సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా..?: కేటీఆర్​

By

Published : Jul 19, 2022, 10:10 PM IST

KTR TWEET: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ.. మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా.. 2018 నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఒక్క రూపాయీ సాయంగా మంజూరు చేయలేదన్నారు. ప్రధాని మోదీ గారూ.. సబ్‌ కా సాథ్‌-సబ్‌ కా వికాస్‌, సమాఖ్య స్ఫూర్తి అంటే అర్థం ఇదేనా? అని ప్రశ్నించారు. 2020లో హైదరాబాద్‌లో సంభవించిన వరదలకు గానీ.. 2022లో గోదావరి వరదలకు గానీ సాయం అందించలేదెందుకు? అని ప్రశ్నించారు.

ఈ మేరకు దేశవ్యాప్తంగా 2018 నుంచి 2022 జులై 12 వరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అందించిన వరద సాయం వివరాలతో కేంద్రం విడుదల చేసిన పట్టికను తన ట్వీట్‌కు కేటీఆర్‌ జత చేశారు.
ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details