రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా భాజపాపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. గుజరాత్‌కు కేటాయించిన నిధులపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ... తనదైన శైలిలో సెటైర్స్ చేశారు. ప్రధాని మోదీ గుజరాత్‌కు... గుజరాత్ కోసం... గుజరాత్ ప్రధానిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేకా మోదీ స్వామ్యమా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. గుజరాత్ కోసం చేసే ప్రకటనలు తాయిలాలు కావా అంటూ ట్విటర్‌లో నిలదీశారు.
ఇవీ చూడండి: