పారిశుద్ధ్య కార్మికులకు తరచూ వైద్య పరీక్షలు: కేటీఆర్ - Minister KTR latest news
కరోనా నియంత్రణ కోసం నిరంతరం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కొరకు అవరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

KTR latest twitter news
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని 141 పట్టణాల్లోని 45 వేలకు పైగా పారిశుద్ధ్య కార్మికులకు వారం వారం ఆరోగ్య శిబిరాల నిర్వహణతో పాటు తరచూ వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న అధికారులకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.