తెరాస ప్రభుత్వం మొదటినుంచీ శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉందని.. అలాంటిది న్యాయవాదులను దారుణంగా చంపితే ఎందుకు ఉపేక్షిస్తామని మంత్రి కేటీఆర్అన్నారు. హత్యలో తమ పార్టీ వ్యక్తి ఉన్నాడని పోలీసులు తేల్చగానే... పార్టీ నుంచి తీసేశామన్నారు. దంపతుల హత్యపై విచారణ వ్యక్తం చేసిన కేటీఆర్.... నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస లీగల్ సెల్ నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటుపై సీఎం, మంత్రి మండలితో చర్చిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
10వేల కోట్లు ఇవ్వొచ్చు కదా
న్యాయవాదుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేశామని.. మోదీ సర్కారు కనీసం 10వేల కోట్లయినా ఇవ్వొచ్చు కదా అన్నారు.