తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister KTR: ఆ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలుస్తామనడం.. మన అభివృద్ధికి నిదర్శనం - హైదరాబాద్‌ జిల్లా వార్తలు

కర్ణాటకలోని రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని ఆ ప్రాంత భాజాపా ఎమ్మెల్యే కోరడం... ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యే కోరికను అక్కడి ప్రజలు సైతం చప్పట్లతో స్వాగతించారని తెలిపారు.

Minister KTR
Minister KTR

By

Published : Oct 11, 2021, 7:12 PM IST

కర్ణాటకలోని రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని ఆ ప్రాంత భాజాపా ఎమ్మెల్యే శివరాజ్ కోరడం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యే కోరికను అక్కడి ప్రజలు సైతం చప్పట్లతో స్వాగతించారని ట్విట్టర్​ వేదికగా తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్ స్థానిక నాయకులు సైతం తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరినట్లు గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details