తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 'రైతుల శ్రేయస్సు పట్ల తెరాస ప్రభుత్వం నిబద్ధతతో ఉంది' - తెలంగాణ వార్తలు

తెలంగాణ సర్కారు రైతన్నకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ ట్వీట్(ktr tweet) చేశారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాత... అప్పుల ఊబిలో చిక్కుకోకూడదన్న లక్ష్యంతో 2014లో రూ.లక్షలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసినట్టు తెలిపారు. కరోనా(corona) సమయంలోనూ తెరాస(trs) ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకుందని వివరించారు.

minister KTR tweet, crop loan waived off
రైతుల రుణమాఫీపై కేటీఆర్, మంత్రి కేటీఆర్ ట్వీట్

By

Published : Aug 21, 2021, 12:03 PM IST

రైతుల శ్రేయస్సు పట్ల తెరాస(trs) ప్రభుత్వం నిబద్ధతతో ఉందని మంత్రి కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. రూ.లక్ష వరకు రైతు రుణాలు మాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు 35.19 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి ట్వీట్‌(ktr tweet) చేశారు. కరోనా(corona) సమయంలోనూ తెరాస ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకుందని వివరించారు. రూ.50 వేల వరకు రుణమాఫీ ద్వారా 9 లక్షల మంది రైతులకు సాయం అందిందన్నారు.

రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 2014లో లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేశామని.. 35.19 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు. అప్పట్లో 16,144.1 కోట్ల మేరకు రైతు రుణాలను మాఫీ చేశామని ట్వీట్‌లో వివరించారు. 2018లోనూ అదే నిబద్ధతతో పనిచేశామని ట్వీట్‌లో వెల్లడించారు.

ఇదీ చదవండి:ys viveka murder case : వివేకా హత్య కేసు.. సమాచారం ఇస్తే రూ.5లక్షల రివార్డు

ABOUT THE AUTHOR

...view details