హరిత తెలంగాణ(HARITHA TELANGANA) సాధనలో సీడ్ కాప్టర్లు(SeedCopters) కీలక భూమిక పోషించనున్నటు మంత్రి కేటీఆర్ ట్విటర్(KTR TWEET) వేదికగా ప్రకటించారు. తగ్గిపోతున్న అడవులను కాపాడుకోవటంతో పాటు తిరిగి మొక్కలు పెంచటం ముఖ్యమన్న కేటీఆర్.... ఇందుకోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ, అటవీ శాఖలు సంయుక్తంగా టీవర్క్స్ , రిచ్ సంస్థలతో కలిసి ఈ సీడ్ కాప్టర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సీడ్ కాప్టర్ల పనితీరును వివరిస్తూ తయారు చేసిన ఓ వీడియోని సైతం కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సీడ్ బాల్స్‌ని తయారుచేసి... వాటిని డ్రోన్ల సాయంతో అడవుల్లో వెదజల్లటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇందుకు ఉపయోగించే డ్రోన్ల వంటి పరికరాలనే సీడ్ కాప్టర్లుగా పేర్కొన్నారు.