తెలంగాణ

telangana

హైదరాబాద్ విశ్వనగరం కావాలనే కేసీఆర్ ఆకాంక్ష మేరకు పనులు: కేటీఆర్‌

By

Published : Mar 2, 2022, 12:08 PM IST

Ktr Launch sanitation vehicles : హైదరాబాద్ నగరంలో చెత్త 2,500 నుంచి 6 వేల టన్నులకు చేరుతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు 4,500 స్వచ్ఛ ఆటోలు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. మరో నెలలో 400 స్వచ్ఛ ఆటోలు అందుబాటులోకి వస్తాయిని పేర్కొన్నారు.

KTR Comments about hyderabad development, KTR Launch
హైదరాబాద్ విశ్వనగరం కావాలనే కేసీఆర్ ఆకాంక్ష మేరకు పనులు: కేటీఆర్‌

Ktr Launch sanitation vehicles : హైదరాబాద్‌లోని చెత్త తరలింపు కేంద్రాలను ఆధునీకరించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఏ నగరంలోనైనా ఘన, ద్రవ వ్యర్థాలు ఉంటాయన్న మంత్రి... నగరంలో చెత్త 2,500 నుంచి 6 వేల టన్నులకు చేరుతోందని తెలిపారు. డోర్ టూ డోర్ చెత్త సేకరణ కోసం 4,500 స్వచ్ఛ ఆటోలు తెచ్చామని... నెల రోజుల్లో మరో 400 ఆటోలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. చెత్త తరలించే 40 అత్యాధునిక వాహనాలను హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్‌ ప్లాజా వద్ద ప్రారంభించారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి కావాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

పెరిగిన సాంకేతికతతో...

KTR Comments about hyderabad development : వంద శాతం సివరేజ్ ట్రీట్​మెంట్ ప్లాంట్ అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్​తో చెరువుల్లో చెత్త, గుఱ్ఱపుడెక్క వంటి వాటిని తొలగించనున్నామని పేర్కొన్నారు. మారుతున్న కాలంతో సాంకేతికతను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సెకండరీ ట్రాన్స్‌పోర్ట్ ప్రాంతానికి తరలించేంచేందుకు అత్యాధునిక వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో ఉన్న 17 ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. 95 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్‌ఫర్ పాయింట్స్ అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటికే నగరంలో 64 హుక్ మౌంటైన్ వాహనాలు ఉన్నాయి. చెత్త నుంచి విద్యుత్ తయారుచేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. జవహర్‌నగర్‌లో ఏర్పాటుచేసే ప్లాంట్‌ దక్షిణాదిలోనే అతి పెద్దది. మరో ప్లాంట్​ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం.

-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

అత్యాధునిక చెత్త తరలింపు వాహనాలు వందకు చేరాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

-తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి

హైదరాబాద్ విశ్వనగరం కావాలనే కేసీఆర్ ఆకాంక్ష మేరకు పనులు: కేటీఆర్‌

ఇదీ చదవండి:GST collections : మళ్లీ రూ.1.30 లక్ష కోట్లను దాటిన జీఎస్టీ రాబడి

ABOUT THE AUTHOR

...view details